Andhra Pradesh: ఏపీలోని మూడు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు

IMD warns 3 districts of AP on heavy rains

  • ఏపీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు
  • 17వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం
  • మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ లో గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు నిండుగా ప్రవహిస్తున్నాయి. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. 17వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయని... మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

  • Loading...

More Telugu News