Venus: శుక్రుడిపై జీవం ఉండే అవకాశం: శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడి

Evidence of Life on Venus

  • శుక్రగ్రహంపై ఫాస్పేన్ వాయువు
  • నిండిపోయిన కార్బన్ డయాక్సైడ్
  • పరిశోధన ఫలితాలు విడుదల

సౌర కుటుంబంలోని వీనస్ (శుక్ర గ్రహంపై) జీవముండే అవకాశాలు ఉన్నాయనడానికి మరింత బలమైన ఆధారాలను శాస్త్రవేత్తలు సంపాదించారు. శుక్ర గ్రహంపై ఫాస్పేన్ వాయువు ఆనవాళ్లు ఉన్నాయని, మనకు అతి దగ్గరలో ఉన్న గ్రహమైన వీనస్ పై పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలు వెల్లడించారు. శుక్ర గ్రహంపై పగటి ఉష్ణోగ్రతలు చాలా భయంకరంగా ఉండి, లెడ్ వంటి లోహాన్ని కరిగించేంతలా ఉంటాయని, మొత్తం కార్బన్ డయాక్సైడ్ వాయువులతో నిండిపోయిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండేవారు.

తాజాగా హవాయి, చీలీలోని అటకామా ఎడారిలో భారీ టెలిస్కోపులను నిలిపి, వాటిద్వారా శుక్రగ్రహాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తల టీమ్, శుక్రగ్రహం ఉపరితలానికి 60 కిలోమీటర్ల దూరం వరకూ మేఘాలు ఆవరించి ఉన్నాయని, ఫాస్పేన్ గ్యాస్ ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొంది. దీన్ని ప్రచురించిన 'నేచర్ ఆస్ట్రానమీ' జర్నల్ లో ఈ మేఘాలు అత్యధిక శక్తిగల ఆమ్లాలను కలిగివున్నాయని, ఇవన్నీ ఫాస్పేన్ ను చాలా త్వరగా ఆవిరయ్యేలా చేస్తున్నాయని, అందువల్లే అక్కడేదో ఉండి ఉండవచ్చని, కొత్తదేదో సృష్టించబడుతోందని తమ రీసెర్చ్ లో తేలిందని అన్నారు.

ప్రస్తుతానికైతే అక్కడ జీవం ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు లేకున్నా, ఉండి ఉండవచ్చని భావిస్తున్నామని, శుక్రగ్రహంపై నిర్వచించలేని రసాయన మార్పులు జరుగుతున్నాయని మాత్రం స్పష్టంగా తెలుస్తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన కార్డిఫ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ సైంటిస్ట్ జేన్ గ్రీవ్స్ వెల్లడించారు. భూమికి పక్కనే ఉన్న పొరుగు గ్రహంలో ఫాస్పేన్ ఆనవాళ్లు స్పష్టమని, ఇక ఏ తరహా జీవులు అక్కడ ఉన్నాయన్న విషయమై మరింత లోతైన పరిశోధనలు చేయాల్సి వుందని అన్నారు. జీవనానికి ముఖ్యమైన మరో ఇతర మూలకం లేదా పరిస్థితులు అక్కడ ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News