Donald Trump: వేరే దేశాలకు లేని సమస్య అమెరికాకు మాత్రమే ఉంది: డొనాల్డ్ ట్రంప్!

Fire Problum Not for all countries says trump

  • అమెరికా అడవుల్లో తరచూ మంటలు
  • ఇటీవలే ప్రాణాలు కోల్పోయిన 35 మంది
  • ఇదేమీ సైన్స్ కు సంబంధించినది కాదన్న ట్రంప్

తరచూ రాజుకుంటున్న అడవుల సమస్య కేవలం అమెరికాలో మాత్రమే ఉన్నదని, ఇది వేరే దేశాలకు లేని సమస్యని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో అడవుల్లో రాజుకున్న మంటలు అనేక రాష్ట్రాలకు విస్తరించి, 35 మంది ప్రాణాలను బలిగొనగా, ట్రంప్ తన ప్రచారంలో ఈ కార్చిచ్చు గురించి ప్రస్తావించనే లేదని విపక్షాలు నిలదీసిన వేళ, ఆయన ఫైర్ ఫైటర్స్ తో సమావేశమై పరిస్థితిపై చర్చించారు.

ఆపై, మీడియాతో మాట్లాడుతుండగా, వాతావరణ మార్పుల కారణంగానే అడవులు మండుతున్నాయా? అన్న ప్రశ్న ఎదురైన వేళ, ట్రంప్ స్పందించారు. అన్ని దేశాల్లో మంటలు అంటుకునే చెట్లు ఉన్నాయని, కానీ, అమెరికాలో ఉన్న సమస్య, వేరే దేశాల్లో లేదని అన్నారు. త్వరలోనే ఈ మంటలు చల్లారుతాయని వెల్లడించిన ఆయన, ఇదేమీ వాతావరణ మార్పులతో వచ్చిన సమస్య కాదని, మేనేజ్ మెంట్ కు సంబంధించిన విషయమని అభివర్ణించారు. అడవుల్లో మంటలకు సైన్స్ కు సంబంధం ఉందని తాను భావించడం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News