Raghu Rama Krishna Raju: సవాల్ విసురుతున్నా.... కావాలంటే బహిష్కరించి చూడండి: రఘురామకృష్ణరాజు

 Raghurama Krishna Raju challenges YCP leaders
  • మరోమారు రఘురామ ఆగ్రహం
  • మిథున్ రెడ్డికి 3 ఓట్లు కూడా రావని వ్యాఖ్యలు
  • అన్నీ మీ కులస్తులకేనా అంటూ విమర్శలు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి వైసీపీ అధినాయకత్వంపై ధ్వజమెత్తారు. తనపై అనర్హత వేటు వేయాలని ఎంపీ మిథున్ రెడ్డి మళ్లీ కోరుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10ని ఓసారి చదువుకోవాలని తమ పార్టీ ఎంపీలకు సూచిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పనుల గురించి ఏనాడైనా మిథున్ రెడ్డి మాట్లాడాడా? అని రఘురామ ప్రశ్నించారు. లోక్ సభా పక్ష నేత ఎన్నిక జరిపితే మిథున్ రెడ్డికి 3 ఓట్లకు మించి రావని స్పష్టం చేశారు. మిథున్ రెడ్డిపై చాలామంది ఎంపీలకు అసంతృప్తి ఉందని అన్నారు.

తనను పార్టీ నుంచి బహిష్కరించినా, పార్లమెంటులో కమిటీ చైర్మన్ గా కొనసాగుతానని స్పష్టం చేశారు. సవాల్ విసురుతున్నా... కావాలంటే బహిష్కరించి చూడండి అంటూ తీవ్రంగా స్పందించారు. ఎలాగైనా తానే కమిటీ చైర్మన్ గా కొనసాగుతానని తెలిపారు. చట్ట ప్రకారం నాపై అనర్హత వేటు వేయడం మీ వల్ల కాదు అని పేర్కొన్నారు. ఈ కమిటీ చైర్మన్ పదవి తన వాక్పటిమ కారణంగా సాధించుకున్నానని ఉద్ఘాటించారు. పదవులన్నీ మీ కులస్తులకేనా? అని ప్రశ్నించారు.
Raghu Rama Krishna Raju
YSRCP
Jagan
Mithun Reddy
Vijayashanti
Parliament

More Telugu News