MPs: ఎంపీల జీతంలో 30 శాతం కోత.. బిల్లుకు లోక్ సభ ఆమోదం!

MPs salaries bill passed in Lok Sabha

  • ఆర్డినెన్స్ కు ఏప్రిల్ 6న ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
  • ఈరోజు లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టిన వైనం
  • రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్ నిధులు కూడా నిలిపివేత

కరోనా నేపథ్యంలో ఎంపీ వేతనాల్లో కోతకు లోక్ సభ ఆమోదం తెలిపింది. మహమ్మారిపై పోరాటానికి నిధులను సమకూర్చడానికి ఏడాది పాటు ఎంపీల జీతాల్లో 30 శాతం కోతను విధించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఏప్రిల్ 6న ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది.

దీనికి సంబంధించిన బిల్లును ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభలో ఆమోదముద్ర పడింది. మరోవైపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా వేతనాల కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మరోవైపు, ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండేళ్ల పాటు నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News