Corona Virus: సీజనల్ వ్యాధిగా మిగిలిపోనున్న కరోనా వైరస్: అధ్యయనంలో తేలిన నిజం

Corona virus ends as a seasonal virus

  • లెబనాన్‌లోని బీరూట్ అమెరికన్ వర్సిటీ అధ్యయనం
  • హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగేంత వరకు వస్తూనే ఉంటుందన్న శాస్త్రవేత్తలు
  • కరోనాకు అలవాటు పడడం తప్పనిసరని స్పష్టీకరణ

ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనా మహమ్మారి చివరికి సీజనల్ వ్యాధిగా మిగిలిపోనుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. హెర్డ్ ఇమ్యూనిటీ (సామాజిక రోగ నిరోధకత) ఎంత త్వరగా సాధిస్తే అంత త్వరగా అది సీజనల్ వ్యాధిగా మారుతుందని లెబనాన్‌లోని బీరూట్ అమెరికన్ యూనివర్సిటీ పేర్కొంది. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే వరకు ప్రతీ సీజన్‌లోనూ ఇది పలుమార్లు వస్తూనే ఉంటుందని అధ్యయనం వివరించింది.

శ్వాసకోశ సంబంధ వైరస్‌లు సీజన్ల వారీగా ఎలా విజృంభిస్తున్నాయి? భవిష్యత్తులో ఈ వైరస్ ఎలా పరిణమించబోతోందన్న అంశంపై శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగితే  కరోనా వ్యాప్తి దానంతట అదే తగ్గిపోతుందని, తర్వాత సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే వైరస్ కనిపిస్తుందని అధ్యయనకర్త హసన్ జారేకేత్ తెలిపారు. ప్రజలు కూడా కరోనాకు అలవాటు పడాలని, కరోనాను దూరంగా ఉంచేందుకు ఇప్పటిలానే మాస్కులు ధరించడం, చేతులను నిత్యం శుభ్రం చేసుకోవడం మాత్రం తప్పనిసరని హసన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News