Kurnool District: శ్రీశైలంలోని ఘంటామఠం ప్రాంగణంలో లభ్యమైన పురాతన తామ్రశాసనాలు, వెండినాణేలు

silver coins and  Copper inscriptions found in Srisailams Ghantamath

  • శివాలయ పునరుద్ధరణ పనులు చేస్తుండగా బయటపడిన వైనం
  • తామ్రపత్రాలపై నాగరి, కన్నడ లిపి
  • వెండి నాణేలు బ్రిటిష్ కాలం నాటివిగా గుర్తింపు

శ్రీశైలంలోని పంచ మఠాల్లో ఒకటైన ఘంటామఠం ప్రాంగణంలోని చిన్న శివాలయ పునరుద్ధరణ పనులు చేస్తుండగా గోడల నుంచి పురాతన తామ్ర శాసనాలు, వెండి నాణేలు బయటపడ్డాయి. మూడు తామ్రపత్రాలు, 245 వెండి నాణేలు లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. తామ్రశాసనాలపై నాగరి, కన్నడ లిపితో పాటు, శివలింగానికి రాజు నమస్కరిస్తున్నట్టు, నంది, గోవు చిత్రాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

దేవస్థానం ఈవో రామారావు, తహసీల్దారు రాజేంద్రసింగ్, ఎస్సై హరిప్రసాద్‌లు ఆలయానికి చేరుకుని వాటిని పరిశీలించారు. వెండినాణేలను 1800-1900 సంవత్సరాల మధ్య బ్రిటిష్ పాలన నాటివిగా అధికారులు గుర్తించారు. తామ్ర పత్రాలకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News