Transgenders: ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం
- ట్రాన్స్ జెండర్లకు రైస్ కార్డులు అందించాలని నిర్ణయం
- అర్హులను గుర్తించనున్న వాలంటీర్లు
- 10 రోజుల్లో రైసు కార్డులు మంజూరు
సమాజంలో వివక్షకు గురవుతూ, సామాన్య ప్రజానీకానికి దూరంగా బతికే ట్రాన్స్ జెండర్లకు ఏపీలోని జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారు ఆకలితో అలమటించకుండా కీలక నిర్ణయం తీసుకుంది. వారికి రైస్ కార్డులను అందించాలని నిర్ణయించింది. ట్రాన్స్ జెండర్లను గ్రామ వాలంటీర్ల సహాయంతో గుర్తించనున్నారు. గుర్తించబడిన ట్రాన్స్ జెండర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి 10 రోజుల్లో రైసు కార్డును అందిస్తారు. ఈ రైస్ కార్డులు పొందినవారు అన్ని సంక్షేమ పథకాలకు అర్హులు అవుతారు.