Kanakamedala Ravindra Kumar: జగన్ అధికారంలోకి వచ్చాక కోర్టులు 90 సార్లు మొట్టికాయలు వేశాయి: కనకమేడల

TDP MP Kanakamedala Ravindra Kumar slams YCP Government
  • సర్కారు జీవో ఒక్కటీ సరిగాలేదని కోర్టులే తేల్చాయన్న కనకమేడల
  • ఆధారాల్లేకుండా వెళితే స్టే ఇస్తున్నారని వెల్లడి
  • న్యాయమూర్తులపై వైసీపీ నేతల వ్యాఖ్యలు సరికాదని హితవు
జగన్ అధికారంలోకి వచ్చాక కోర్టులు 90 సార్లు మొట్టికాయలు వేశాయని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక్క జీవో కూడా సరిగా లేదని కోర్టులే తేల్చాయని స్పష్టం చేశారు. ఆధారాలు లేని కేసులతో కోర్టులకు వెళితే స్టే ఇస్తున్నారని వెల్లడించారు. కోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా అమలు చేయడంలేదని, పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాలని కోర్టులు చెప్పినా వినడంలేదని ఆరోపించారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కోర్టులు, న్యాయమూర్తులపై వైసీపీ నేతల వ్యాఖ్యలు సరికాదని కనకమేడల హితవు పలికారు.
Kanakamedala Ravindra Kumar
Jagan
YSRCP
Courts
Andhra Pradesh
Telugudesam

More Telugu News