Somu Veerraju: దేవాలయాలకు వెళ్లిన వారిపై కేసులు పెడతారా? ఛలో అమలాపురం జరిపి తీరుతాం: సోము వీర్రాజు
- ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
- బీజేపీ శ్రేణుల వివరాలను ఎందుకు సేకరిస్తున్నారు?
- రేపు ఛలో అమలాపురం చేపడతాం
ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. దాడులకు గురైన ఆలయాల సందర్శనకు వెళ్లిన యువకులపై కేసులు పెట్టడం దారుణమని అన్నారు.
ప్రభుత్వ ఆగడాలను నిరసిస్తూ రేపు ఛలో అమలాపురం కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని చెప్పారు. ఛలో అమలాపురం కార్యక్రమాన్ని తాను ఇప్పటి వరకు ప్రకటించనప్పటికీ... వాలంటీర్ల ద్వారా గ్రామాల్లోని బీజేపీ నేతలు, కార్యకర్తల వివరాలను ప్రభుత్వం ఎందుకు సేకరిస్తోందని ప్రశ్నించారు. దేవాలయాలను పరిరక్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయని చెప్పారు.