Budda Venkanna: విజయసాయిరెడ్డి వెన్నులో వణుకు మొదలయింది: బుద్ధా వెంకన్న

Vijayasai Reddy is shivering with Supreme Courts decision says Budda Venkanna

  • ఆర్థిక నేరాల విచారణను ఏడాదిలో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది
  • జైల్లో ఉండి వచ్చిన జగన్, విజయసాయి న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరం
  • కోర్టులను కించపరిచేలా మాట్లాడుతున్నారు

ఆర్థిక నేరాల కేసుల విచారణను ఏడాదిలోపే పూర్తి చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించడంతో వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి వెన్నులో వణుకు మొదలైందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. అందువల్లే న్యాయ వ్యవస్థపై దాడిని మొదలుపెట్టారని అన్నారు. 11 ఛార్జ్ షీట్లు, లక్ష కోట్ల దోపిడీ, సూట్ కేసు కంపెనీల సూత్రధారి, క్విడ్ ప్రోకో పిత, 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చిన విజయసాయిరెడ్డి, జగన్ లు న్యాయవ్యవస్థ గురించి మాట్లాడటం వింతగా ఉందని చెప్పారు.

లక్ష కోట్ల దోపిడీ కేసు విచారణ వివరాలు మీడియాలో వస్తే పరువుకి భంగం కలుగుతుందంటూ, మీడియాలో కేసు వివరాలు ప్రసారం చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టులను కోరిన జగన్, విజయసాయి ఈరోజు పత్రికాస్వేచ్ఛ అంటూ హడావుడి చేయడం విడ్డూరంగా ఉందని వెంకన్న అన్నారు. మీడియా గొంతులను నొక్కుతూ జీవో తీసుకొచ్చిన జగన్... వివిధ కేసుల్లో వివిధ కోర్టులు అనేక సందర్భాల్లో ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ ను తప్పుబట్టడం న్యాయస్థానాలను కించపరచడమే అవుతుందని విమర్శించారు.

  • Loading...

More Telugu News