Sensex: వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 134 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 11 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- నష్టపోయిన బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు బలహీనంగా ట్రేడ్ కావడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 134 పాయింట్లు నష్టపోయి 38,845కి పడిపోయింది. నిఫ్టీ 11 పాయింట్లు కోల్పోయి 11,504 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.79%), ఎన్టీపీసీ (2.48%), టెక్ మహీంద్రా (2.29%), సన్ ఫార్మా (2.23%).
టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ (-2.39%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.07%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.92%), మారుతి సుజుకి (-1.88%), టైటాన్ కంపెనీ (-1.67%).