Brahmotsavam: తిరుమలలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ... రేపటి నుంచి స్వామివారి వాహన సేవలు

Tirumala Lord Venkateswara Swamy Brahmotsavams

  • ఈసారి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు
  • రేపు సాయంత్రం ధ్వజారోహణంతో వాహన సేవలు మొదలు
  • కరోనా నేపథ్యంలో ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అధికమాసం కారణంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత సాలకట్ల బ్రహ్మోత్సవాలు, ఆపై దసరా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

కాగా, సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఈ సాయంత్రం అంకురార్పణ చేశారు. తద్వారా స్వామివారి ఉత్సవాలకు ముక్కోటి దేవతలను, భక్తులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇక రేపు సాయంత్రం ధ్వజారోహణం ఉంటుంది. ఈ క్రతువు అనంతరం శ్రీవారి వాహన సేవలు షురూ అవుతాయి. ఈ క్రమంలో శ్రీ వేంకటేశ్వరుడు తొలుత పెద్ద శేష వాహనాన్ని అధిరోహించనున్నారు. ఈసారి కరోనా వ్యాప్తి కారణంగా స్వామివారి బ్రహ్మోత్సవాలను భక్తులు లేకుండా ఏకాంతంలో నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News