Parliament Sessions: పార్లమెంటు సమావేశాలను కుదించే యోచనలో కేంద్ర ప్రభుత్వం

Centre to reduce parliament working days amid MPs Corona cases
  • కరోనా బారిన పడుతున్న ఎంపీలు
  • అంతకంతకూ పెరుగుతున్న కేసులు
  • పని దినాలపై పునరాలోచనలో పడిన కేంద్రం
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా బారిన పడుతున్న ఎంపీల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తోంది.

 ఇప్పటికే దాదాపు  30 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత సమావేశాలు ఈ నెల 14 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్నాయి. పార్లమెంటు ప్రాంగణం వద్ద అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం పునరాలోచనలో పడింది. సమావేశాల రోజులను కుదించే యోచనలో కేంద్రం ఉందని పార్లమెంట్ అధికారులు చెపుతున్నారు.
Parliament Sessions
Working days
Centre

More Telugu News