Jawahar: డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్ ఆలయంలోకి వెళ్లాలి: జవహర్ 

Jagan has to enter temple after signing declaration olny says Jawahar

  • జగన్ కు దళితులు, హిందూ దేవుళ్లు నచ్చరు
  • సోనియాగాంధీ కూడా డిక్లరేషన్ ఇచ్చారు
  • స్వరూపానంద కాళ్లు నొక్కితే స్వర్గం లభిస్తుందని జగన్ భావిస్తున్నారు

తిరుమల ఆలయంలోకి వెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్ డిక్లరేషన్ పై సంతకం చేయబోరని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ అంశంపై టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ స్పందిస్తూ... డిక్లరేషన్ ఇచ్చే పరిస్థితి లేదని వైవీ సుబ్బారెడ్డి చెపుతున్నారని... రానున్న రోజుల్లో దర్శనాలు, సంప్రోక్షణ, బ్రహ్మోత్సవాలతో పాటు దేవుడికి ఏదీ లేకుండా చేసే పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో తలెత్తేలా ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత దళితుల మీద, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయని జవహర్ ఆరోపించారు. జగన్ కు మనుషుల్లో దళితులు నచ్చరని, దేవుళ్లలో హిందూ దేవుళ్లు నచ్చరని విమర్శించారు. తాను మత విశ్వాసాలను గౌరవిస్తానని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే సోనియాగాంధీ దేవాలయంలోకి ప్రవేశించారని చెప్పారు. జగన్ కూడా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల ఆలయంలోకి ప్రవేశించాలని డిమాండ్ చేశారు.

విశాఖ స్వరూపానంద కాళ్లు నొక్కితే చాలు స్వర్గం లభిస్తుందని జగన్ భావిస్తున్నారని అన్నారు. గంగలో మునిగితే హిందూభావం వచ్చినట్టేననని భావిస్తే పొరపాటేనని ఎద్దేవా చేశారు. ప్రజల మనోభావాలను గౌరవించలేని జగన్.... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రశాంతంగా జైల్లో కూర్చోవాలని అన్నారు. అంతర్వేదిలో రథం దగ్ధం కావడం, దుర్గ గుడిలో వెండి సింహాలు మాయం కావడం జగన్ అలసత్వానికి నిదర్శనమని చెప్పారు.

  • Loading...

More Telugu News