Saurabh Tiwary: ఐపీఎల్ 2020: రాణించిన సౌరభ్ తివారీ... చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 163 రన్స్
- ప్రారంభమైన ఐపీఎల్
- తొలి మ్యాచ్ లో ముంబయి వర్సెస్ చెన్నై
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై
- నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసిన ముంబయి
యూఏఈ గడ్డపై ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. ముంబయి ఇన్నింగ్స్ లో సౌరభ్ తివారీ (42) టాప్ స్కోరర్. ఓపెనర్ క్వింటన్ డికాక్ 33 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. హార్దిక్ పాండ్యా (14), కీరన్ పొలార్డ్ (18) భారీ స్కోర్లు సాధించలేకపోయారు.
చెన్నై బౌలర్లలో లుంగీ ఎంగిడి 3 వికెట్లు తీశాడు. దీపక్ చహర్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సఫారీ బౌలర్ లుంగీ ఎంగిడి కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో చివర్లో ముంబయి ఇండియన్స్ వేగంగా పరుగులు తీయలేకపోయింది.
అనంతరం 163 పరుగుల లక్ష్య సాధనకు బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన ఓపెనర్ షేన్ వాట్సన్... ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం చెన్నై స్కోరు 2 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది.