UAE: యూఏఈకి వచ్చేసిన కరోనా వ్యాక్సిన్... తొలి డోస్ తీసుకున్న ఆరోగ్య మంత్రి!

Corona Vaccine First Dose for UAE Health Minister

  • ప్రస్తుతం మూడవ దశలో వ్యాక్సిన్
  • హెల్త్ వర్కర్లకు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం
  • ప్రజలను రక్షిస్తామన్న యూఏఈ మంత్రి

కరోనా నివారణకు వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు ఎన్నో దేశాల ఫార్మా కంపెనీలు ప్రయత్నిస్తుండగా, వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకముందే, ప్రజలకు పంపిణీ చేస్తున్న తొలి దేశంగా రష్యా నిలువగా, దాని సరసన యూఏఈ కూడా చేరిపోయింది. ఇటీవల వ్యాక్సిన్ ను కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ యోధులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, తొలి విడత వ్యాక్సిన్ డోస్ దేశంలోకి అందుబాటులోకి వచ్చింది.

యూఏఈ ఆరోగ్య శాఖా మంత్రి అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఓవైస్, ఈ వ్యాక్సిన్ తొలి డోస్ ను తీసుకున్నారు. దీని ట్రయల్స్ లో ఎలాంటి దుష్పరిణామాలూ సంభవించలేదని, ఈ కారణంగానే తాను టీకాను తీసుకున్నానని ఆయన వెల్లడించారు. దేశ ప్రజలను రక్షించడంలో తాము ముందుంటామని, ఈ వ్యాక్సిన్ ను కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు ముందుగా ఇస్తామని అన్నారు.

కాగా యూఏఈలోని అబూదాబిలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ మూడవ దశ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ను దేశంలోని 125 దేశాలకు చెందిన 31 వేల మందిపై ప్రయోగించి, ఫలితాలను వైద్యాధికారులు సమీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News