Union Cabinet: పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
- 2021-22 రబీ సీజన్ కు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం
- జాబితాలో బార్లీ, గోధుమ పంటలు
- కాసేపట్లో అధికార ప్రకటన చేయనున్న కేంద్రం
రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2021-22 రబీ సీజన్ కు కనీస మద్దతు ధరను పెంచాలని నిర్ణయించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు వెల్లడించారు. కాసేపట్లో దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది.
మద్దతు ధర పెరగనున్న పంటల జాబితాలో బార్లీ, గోధుమ, ఆవాలు, కుసుమ తదితరాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని విపక్షాలు ఆరోపిస్తున్న తరుణంలో... కనీస మద్దతు ధరను పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.