David Warner: ఆరంభంలోనే వార్నర్ అవుట్... లక్ష్యఛేదనలో ముందుకెళుతున్న సన్ రైజర్స్
- ఐపీఎల్ లో సన్ రైజర్స్ వర్సెస్ బెంగళూరు
- బెంగళూరు స్కోరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 రన్స్
- సన్ రైజర్స్ స్కోరు 9 ఓవర్లలో 1 వికెట్ కు 72 పరుగులు
ఐపీఎల్ 13వ సీజన్ లో భాగంగా దుబాయ్ లో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగింది. అయితే ఆరంభంలోనే కెప్టెన్ డేవిడ్ వార్నర్ (6) అవుటయ్యాడు. వార్నర్ రనౌట్ రూపంలో వెనుదిరగడంతో సన్ రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 1.4 ఓవర్లలో 18 పరుగులు.
ఈ దశలో ఓపెనర్ జానీ బెయిర్ స్టో (35 బ్యాటింగ్)కు మనీష్ పాండే (29 బ్యాటింగ్) జత కలవడంతో స్కోరు బోర్డు ఉరకలేసింది. వీరిద్దరూ ధాటిగా ఆడడంతో పరుగులు ధారాళంగా వచ్చాయి. సన్ రైజర్స్ స్కోరు 9 ఓవర్లలో 72 పరుగులు కాగా, ఇంకా 66 బంతుల్లో 92 పరుగులు చేయాల్సి ఉంది.