Sensex: ఆరు రోజుల నష్టాలకు బ్రేక్..భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు!
- 835 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 245 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 6 శాతానికి పైగా పుంజుకున్న బజాజ్ ఫిన్ సర్వ్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల నుంచి కోలుకున్నాయి. వరుసగా ఆరు రోజుల నష్టాలకు అడ్డుకట్ట వేశాయి. ఈ వారాన్ని భారీ లాభాల్లో ముగించాయి. ఉద్దీపన ప్యాకేజీకి అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు సుముఖంగా ఉన్నారనే వార్తలు మార్కెట్లలో జోష్ ని నింపాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 835 పాయింట్లు లాభపడి 37,389కి పెరిగింది. నిఫ్టీ 245 పాయింట్లు పెరిగి 11,050కి ఎగబాకింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను చవిచూశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (6.64%), హెచ్సీఎల్ (5.01%), భారతి ఎయిర్ టెల్ (4.98%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.97%), ఎల్ అండ్ టీ (4.58%). సెన్సెక్స్ లో ఒక్క కంపెనీ కూడా నష్టపోలేదు.