Sushant Singh Rajput: సుశాంత్ ను ఊపిరాడకుండా చేసి చంపేశారని ఎయిమ్స్ డాక్టర్ చెప్పారు: కుటుంబ న్యాయవాది

Sushant family lawyer says AIIMS doctor told Sushant was strangled to death
  • సుశాంత్ కేసులో సీబీఐ విచారణ
  • దీన్ని హత్య కేసుగా మార్చాలంటున్న న్యాయవాది వికాస్ సింగ్
  • ఇది ఆత్మహత్య కాదంటూ ట్వీట్
నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబ న్యాయవాది వికాస్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ది ఆత్మహత్య కాదని, సుశాంత్ ను ఊపిరాడకుండా చేసి చంపేశారని ఎయిమ్స్ డాక్టర్ చెప్పారని వెల్లడించారు. ఈ కేసులో ఫోరెన్సిక్ టెస్టులు చేసిన ఎయిమ్స్ బృందంలో ఆ డాక్టర్ కూడా సభ్యుడని వివరించారు. దీనిపై వికాస్ సింగ్ ట్వీట్ చేశారు.

"సుశాంత్ వ్యవహారాన్ని ఆత్మహత్య కేసు నుంచి హత్య కేసుగా మార్చడంపై నిర్ణయం తీసుకోవడంలో సీబీఐ జాప్యం చేస్తోంది. ఇది ఎంతో అసహనం కలిగిస్తోంది. ఎయిమ్స్ బృందంలో సభ్యుడైన డాక్టర్ చాలారోజుల కిందటే ఇది ఆత్మహత్య కాదని, ఊపిరాడకుండా చేసి చంపేశారని చెప్పారు. ఆయన పంపిన ఫొటోలు కూడా అది ఆత్మహత్య కాదని 200 శాతం నిరూపిస్తున్నాయి" అంటూ వ్యాఖ్యానించారు.
Sushant Singh Rajput
Vikas Singh
Family Lawyer
AIIMS Doctor
CBI

More Telugu News