Shraddha Kapoor: డ్రగ్స్‌ కేసులో హీరోయిన్ దీపిక ఫోన్‌ను సీజ్ చేసిన అధికారులు.. విచారణకు వచ్చిన సాహో భామ శ్రద్ధా కపూర్

 Actor Shraddha Kapoor reaches Narcotics Control Bureau zonal office in Mumbai
  • దీపిక నుంచి పలు వివరాలను రాబట్టిన అధికారులు
  • ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి శ్రద్ధాకపూర్  
  • కొనసాగుతోన్న విచారణ
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో విచారణ జరుపుతోన్న అధికారులకు సినీ పరిశ్రమలో‌ని కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్‌ వాడుతున్నట్లు తెలయడంతో దీనిపై విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హీరోయిన్‌ దీపికా పదుకొణే ఈ రోజు ఉదయం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారుల ముందు విచారణకు హాజరైంది.

ఆమె నుంచి అధికారులు పలు వివరాలను రాబట్టారు. ఆమె ఫోనును అధికారులు సీజ్ చేసినట్లు తెలిసింది. డ్రగ్స్‌ కేసులో దీపికతో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఇప్పటికే ప్రశ్నించిన అధికారులు ప్రస్తుతం సాహో భామ శ్రద్ధా కపూర్‌ను ప్రశ్నిస్తున్నారు. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి శ్రద్ధాకపూర్ వచ్చింది.

దీపిక, శ్రద్ధా, రకుల్‌తో పాటు ఈ కేసులో సారా అలీఖాన్‌, దీపిక మేనేజర్‌ కరీష్మా ప్రకాశ్‌కు ఎన్సీబీ అధికారులు ఇటీవల సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు  ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతున్నారు.
Shraddha Kapoor
ncb
Deepika Padukone
Sushant Singh Rajput

More Telugu News