Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
- వాలంటీర్లుగా పని చేస్తున్న వేలాది మంది మహిళలు
- ప్రసూతి సెలవులను కల్పించిన ప్రభుత్వం
- హర్షం వ్యక్తం చేస్తున్న మహిళా ఉద్యోగులు
ఏపీలో జగన్ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. క్షేత్ర స్థాయిలో పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. వేలాది మంది మహిళలు గ్రామ, వార్డు వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు.
అయితే, సాధారణ మహిళా ఉద్యోగులు మాదిరి వీరికి ప్రసూతి సెలవులు లేకపోవడంతో ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. దీంతో, ప్రభుత్వం వీరికి గుడ్ న్యూస్ చెప్పింది. ఇతర మహిళా ఉద్యోగులతో సమానంగా 180 రోజులు ప్రసూతి సెలవులను కల్పిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల మహిళా వాలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.