Devineni Uma: దిక్కుతోచని స్థితిలో సుబాబుల్, జామాయిల్ రైతు: దేవినేని ఉమ

devineni uma slams jagan

  • చంద్రబాబు హయాంలో టన్నుకు రూ.4,200
  • నేడు దక్కేది టన్నుకు 900 రూపాయలు మాత్రమే
  • రైతులను దోపిడీ చేస్తున్న దళారులు
  • అయినకాడికి అమ్మి తోటలు తొలగిస్తున్న రైతులు

ఆంధ్రప్రదేశ్‌లో సుబాబుల్, జామాయిల్ ధరలు భారీగా పడిపోయాయని, టన్నుకు కేవలం రూ.900 నుంచి 1,300 మాత్రమే వస్తున్నాయని ఓ దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ ఏపీ సర్కారుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ధరలు తక్కువ వస్తుండడంతో రైతులు తోటలు తొలగిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాల రైతుల కష్టాలను అందులో తెలిపారు.

'దిక్కు తోచని స్థితిలో సుబాబుల్, జామాయిల్ రైతు. చంద్రబాబు నాయుడి హయాంలో టన్నుకు 4,200 వరకు అమ్మిన రైతుకు నేడు దక్కేది టన్నుకు 900 రూపాయలు మాత్రమే, రైతులను దోపిడీ చేస్తున్న దళారులు, అయినకాడికి అమ్మి తోటలు తొలగిస్తున్న రైతులు. 2015 ధరల ప్రకారం 4,200కి మార్కెట్ కమిటీలు కొనుగోలు చేయాలంటున్న  రైతుల మాటలు వినబడుతున్నాయా? వైఎస్ జగన్‌ గారు?' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.


  • Loading...

More Telugu News