Nara Lokesh: బీసీలకు, యువతకు ప్రాధాన్యం ఇస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం శుభపరిణామం: నారా లోకేశ్

Nara Lokesh welcomes Chandrababu decision of new chiefs for party parliamentary constituencies
  • పార్లమెంటు నియోజకవర్గాలకు నూతన ఇన్చార్జిలు
  • నిర్ణయం తీసుకున్న చంద్రబాబు
  • కొత్తవారికి అవకాశం
ఏపీలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినాయకత్వం కొత్త ఇన్చార్జిలను నియమించింది. టీడీపీ అధినేత చంద్రబాబు పాతవారిని తప్పించి, కొత్తవారికి అవకాశం ఇచ్చారు. దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులుగా, సమన్వయకర్తలుగా నియమితులైన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

బీసీలకు, యువతకు ప్రాధాన్యం ఇస్తూ అధినేత చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం శుభపరిణామం అని కొనియాడారు. అందరూ కలిసికట్టుగా, చక్కని సమన్వయంతో కార్యకర్తల అండతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన ఇన్చార్జిలు, సమన్వయకర్తల జాబితాను కూడా లోకేశ్ ట్విట్టర్ లో పంచుకున్నారు.
Nara Lokesh
Chandrababu
Incharge
Parliament Constituency
Telugudesam
Andhra Pradesh

More Telugu News