Sathya Kumar: వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోతుంది... టీడీపీ మునిగిపోతున్న నావ: సత్యకుమార్

BJP National Secretary Sathya Kumar slams YCP and TDP
  • బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితుడైన సత్యకుమార్
  • ఏపీలో వైసీపీనే తమ ప్రధాన ప్రత్యర్థి అని వెల్లడి
  • వైసీపీ, టీడీపీ కుటుంబ, కుల పార్టీలంటూ వ్యాఖ్యలు
బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితుడైన ఏపీ నేత సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీనే తమ ప్రధాన ప్రత్యర్థి అని స్పష్టం చేశారు. వైసీపీతో బీజేపీకి లోపాయికారీ ఒప్పందాలేవీ లేవని సత్యకుమార్ ఉద్ఘాటించారు. టీడీపీ మునిగిపోతున్న నావ అని, దాన్ని ఎవరూ కాపాడలేరని అన్నారు.

వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు కుటుంబం, కులం కోసమే పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రజాసమస్యలపై రాష్ట్రంలో బీజేపీనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని తెలిపారు. బీజేపీ, జనసేన పోరాటాన్ని ఏపీ ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ అవినీతి మచ్చలేని, నిజాయతీ ఉన్న నాయకుడు అని కొనియాడారు.
Sathya Kumar
BJP
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News