Jaswant Singh: జోధ్ పూర్ లో ముగిసిన జస్వంత్ సింగ్ అంత్యక్రియలు!

Jaswant Singh Cremation Completed within Hours after Death
  • ఆదివారం ఉదయం కన్నుమూత
  • కరోనా నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు
  • జస్వంత్ కు ప్రముఖుల కడసారి నివాళులు
దాదాపు ఐదు సంవత్సరాల పాటు కోమాలో ఉండి, నిన్న ఉదయం గుండెపోటుతో న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ అంత్యక్రియలు, ఆయన సొంత ప్రాంతమైన జోధ్ పూర్ లో ముగిశాయి. జస్వంత్ మరణించగానే ఆయన మృతదేహాన్ని రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు తరలించిన బంధుమిత్రులు ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు ముగించారు.

ఈ క్రతువులో కొంతమంది దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. వారంతా ఫేస్ మాస్క్ లు ధరించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ, జస్వంత్ కు కడసారి నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలను సంప్రదాయం ప్రకారం, కుమారుడు మన్వేంద్ర సింగ్ ముగించారు. జస్వంత్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిశాయి.
Jaswant Singh
Cremation
Last Riots

More Telugu News