Devendra Fadnavis: మేమేమీ చేయకుండానే ‘మహా’ ప్రభుత్వం కూలిపోతుంది: దేవేంద్ర ఫడ్నవీస్

No Intension of joining hands with shivsena says Fadnavis
  • సంకీర్ణంలోని సొంత వైరుధ్యాల వల్ల కుప్పకూలుతుంది
  • శివసేనతో చేతులు కలిపే ఉద్దేశం లేదు
  • సంజయ్ రౌత్‌తో జరిగిన సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం లేదు
మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జోస్యం చెప్పారు. అధికారంలో ఉన్న మహావికాశ్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఏమీ చేయాల్సిన అవసరం లేదని, సొంత వైరుద్ధ్యాల కారణంగానే ప్రభుత్వం కుప్పకూలుతుందని వ్యాఖ్యానించారు.

ఇక ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై తాము ఆలోచిస్తామని పేర్కొన్నారు. శివసేనతో చేతులు కలిపే ఉద్దేశం కానీ, ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం కానీ తమకు లేవన్నారు. ఎంపీ సంజయ్ రౌత్‌తో జరిగిన సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం లేదని, తాము తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తొందరపడడం లేదని ఫడ్నవీస్ తేల్చి చెప్పారు.
 
కాగా, ఫడ్నవీస్‌తో భేటీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ స్పందించారు.  రాష్ట్రంలోని సమస్యలపై మాట్లాడేందుకే ఆయనతో భేటీ అయినట్టు చెప్పారు. తమ మధ్య ఉన్నది సైద్ధాంతిక వైరుధ్యమే తప్ప శత్రుత్వం కాదని స్పష్టం చేశారు. మాజీ సీఎం అయిన ఫడ్నవీస్‌ను సామ్నా పత్రిక కోసం ఇంటర్వ్యూ చేయాలని గతంలో అనుకున్నామని, అయితే కరోనా నేపథ్యంలో అది కార్యరూపం దాల్చలేదన్నారు. తమ భేటీ గురించి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు తెలుసని రౌత్ పేర్కొన్నారు.
Devendra Fadnavis
Maharashtra
Shivsena
Sanjay Raut
BJP

More Telugu News