Viral Videos: తాటి చెట్టును ఇలా కూడా నరుకుతారా.. విపరీతంగా వైరల్ అవుతోన్న వీడియో!

Man Cuts Palm Tree While Sitting On It Watch What Happens
  • పొడవాటి తాటి చెట్టును ఎక్కిన వ్యక్తి
  • తాటి మట్టలు ఉండే భాగం నరికిన వైనం
  • చెట్టుపై ఊగిపోయిన వ్యక్తి
ఓ పొడవాటి తాటిచెట్టుపైకి ఎక్కిన ఓ వ్యక్తి అక్కడే కూర్చుని, దాని పై భాగాన్ని నరికేశాడు. దీంతో తాటి మట్టలు ఉండే భాగం కిందపడిపోయింది. అనంతరం ఆ దెబ్బకు చెట్టూ అటూ ఇటూ ఊగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు తమ స్మార్ట్‌ఫోన్లతో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. చెట్టుపై చాలా ఎత్తున వున్న ఆ వ్యక్తి చెట్టుతో పాటు తానూ అటూ ఇటూ ఊగిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

చెట్టును కింద నుంచి మొదలే నరకవచ్చని, అతడు అంత పైకి ఎక్కి సాహసం చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, చెట్టు కింది భాగాన్ని నరికితే అక్కడనున్న ఇళ్లపై పడి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతోనే అతడు చెట్టుపైకి ఎక్కి ఇలా చేసి ఉండొచ్చని కొందరు కామెంట్లు చేశారు.

'ఓ మై గాడ్.. చెట్టుని ఇలా కూడా నరుకుతారా?' అంటూ మరొకరు కామెంట్ చేశారు.‌ రెక్స్‌ చాప్మన్ అనే వ్యక్తి తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా 66 లక్షల మంది చూశారు. 34 క్షణాల పాటు ఈ వీడియో ఉంది.
Viral Videos
Social Media

More Telugu News