Rohit Sharma: దుబాయ్ లో నేడు రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ

Dubai hosts the clash between Rohit Sharma and Virat Kohli sides
  • ఐపీఎల్ లో ముంబయి, బెంగళూరు మధ్య మ్యాచ్
  • మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న దుబాయ్
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
ఐపీఎల్ లో భాగంగా నేడు ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఈ పోరులో ప్రధానంగా అందరి దృష్టి ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, బెంగళూరు సారథి విరాట్ కోహ్లీలపై ఉండనుంది. ఇరు జట్లు టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడాయి. ఒక మ్యాచ్ లో గెలిచి, మరో మ్యాచ్ లో పరాజయం పాలై సమవుజ్జీలుగా ఉన్నాయి. అయితే రన్ రేట్ పరంగా ముంబయి ఓవరాల్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా, బెంగళూరు ఏడో స్థానంలో కొనసాగుతోంది.

ఇక, తాజా మ్యాచ్ విషయానికొస్తే రెండు జట్లలోనూ ఆసక్తి కలిగించే ఆటగాళ్లున్నారు. ముంబయి జట్టులో రోహిత్ తో పాటు డికాక్, పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, బౌల్ట్... బెంగళూరు టీమ్ లో కోహ్లీ, ఫించ్, డివిల్లీర్స్, సైనీ, చహల్, జంపా తదితరులు మ్యాచ్ మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్నవారే.
Rohit Sharma
Virat Kohli
Dubai
Mumbai Indians
Royal Challengers Banglore
IPL 2020

More Telugu News