Kodali Nani: దేనికీ పనికిరాని టీడీపీ నేతలు టీవీల ముందుకొచ్చి విషపూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారు: కొడాలి నాని

Kodali Nani once again fired on Chandrababu and TDP leaders
  • టీడీపీ సన్నాసులు చంద్రబాబు స్క్రిప్టు చదువుతున్నారని వ్యాఖ్యలు
  • టీడీపీ వాళ్లే దళితులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపణ
  • ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం
టీడీపీపైనా, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపైనా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ సన్నాసులకు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవడం తప్ప లోకజ్ఞానం తెలియదని విమర్శించారు.

దేనికీ పనికిరాని కొందరు టీడీపీ నేతలు టీవీల ముందుకు వచ్చి విషపూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. దళితులకు ద్రోహం జరుగుతోందంటూ టీవీ చానళ్లు చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయని, వాస్తవానికి టీడీపీ నేతలే దళితులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు నిర్మాతగా రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు దర్శకత్వంలో ప్రతిరోజూ అద్భుతమైన సినిమా చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓవైపు దళితులపై దాడులు చేయిస్తూ, ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.
Kodali Nani
Chandrababu
Telugudesam
Dalits
YSRCP

More Telugu News