Rhea Chakraborty: డ్రగ్స్ సిండికేట్ లో సుశాంత్ ప్రియురాలు రియాదే కీలక పాత్ర: ఎన్సీబీ

NCB Affidavit on Rhea Chakravarthy in Mumbai High Court
  • సుశాంత్ కు డ్రగ్స్ ఇచ్చింది ఆమే
  • డ్రగ్స్ సిండికేట్ లో యాక్టివ్ గా ఉండే రియా
  • ఆమె ఇంట్లో మాదకద్రవ్యాలను దాచుకుంది
  • బెయిల్ ఇవ్వరాదని హైకోర్టులో ఎన్సీబీ అఫిడవిట్
టాలీవుడ్ లో తాము విచారిస్తున్న డ్రగ్స్ కేస్ సిండికేట్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిదే కీలక పాత్రని, ఆమె తన సోదరుడు షోవిక్ తో కలిసి ఈ దందాను సాగించినట్టుగా ఆధారాలు ఉన్నాయని కేసును విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తన అఫిడవిట్ ను ముంబై హైకోర్టులో దాఖలుచేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ, రియా చక్రవర్తి వేసిన పిటిషన్ విచారణకు రాగా, ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పేరిట ఇది దాఖలైంది. డ్రగ్స్ ట్రాఫికింగ్ కు రియా నిధులను అందించిందని, దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వాట్స్ యాప్ చాటింగ్ రూపంలో ఉందని వెల్లడించింది.

రియా మొబైల్, ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్ లో మాదకద్రవ్యాల సరఫరాకు సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయని, కేసు విచారణ జరుగుతున్న దశలో బెయిల్ ను మంజూరు చేస్తే, బయటకు వచ్చి సాక్ష్యాలను నాశనం చేసే అవకాశాలు ఉన్నాయని, బెయిల్ ఇవ్వరాదని కోరింది. రియా చక్రవర్తి తరచుగా డ్రగ్స్ సరఫరాదారులతో మాట్లాడుతూ, వారితో సంబంధాలు కొనసాగించారని కూడా ఎన్సీబీ తన అఫిడవిట్ లో స్పష్టం చేసింది. సుశాంత్ సింగ్ డ్రగ్స్ వాడతాడన్న సంగతి రియాకు తెలుసునని, అతనికి పలుమార్లు వాటిని అందించింది కూడా ఆమేనని పేర్కొంది. తన ఇంటిలో ఆమె డ్రగ్స్ ను దాచి పెట్టినట్టు కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

సుశాంత్ తో పాటు సమాజంలో పేరు ప్రతిష్ఠలున్న ఎంతో మందికి రియా స్వయంగా మత్తు మందులు అందించిందని, డ్రగ్స్ సిండికేట్ లో ఆమె ఓ యాక్టివ్ మెంబర్ అని, ముంబైకి డ్రగ్స్ తెచ్చే ఎంతో మందితో ఆమెకు సంబంధాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. ఇందుకు సంబంధించిన చెల్లింపులన్నీ క్రెడిట్ కార్డులు, పేమెంట్ గేట్ వేల మాధ్యమంగా జరిగాయని, పలుమార్లు నగదును కూడా ఆమె చెల్లించిందని తెలుపుతూ, బెయిల్ ఇవ్వరాదని విజ్ఞప్తి చేసింది.
Rhea Chakraborty
Sushant Singh Rajput
Drugs
NCB

More Telugu News