Ram madhav: 'బాబ్రీ మసీదు కూల్చివేత కేసు' తీర్పుపై రామ్‌ మాధవ్ స్పందన

Ram madhav on Babri Demolition Verdict

  • సత్యం గెలిచింది
  • దేశంలోని ఎంతో గౌరవనీయులైన నాయకులపై కేసు
  • చివరకు మూడు దశాబ్దాల తర్వాత తొలగిపోయింది
  • ఈ తీర్పును ప్రతి ఒక్కరు స్వాగతించాలి

బాబ్రీ మసీదు కూల్చి వేత కేసులో 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు ఈ కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా తేల్చడం పట్ల ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

'సత్యం గెలిచింది. బాబ్రీ కుట్రపూరిత కేసులో నిందితులుగా ఉన్న వారిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించడంలో చాలా ఆలస్యం జరిగింది. దేశంలోని ఎంతో గౌరవనీయులైన కొందరు నాయకులపై కుట్రపూరితంగా పెట్టిన ఈ కేసు చివరకు మూడు దశాబ్దాల తర్వాత తొలగిపోయింది. ఈ తీర్పును ప్రతి ఒక్కరు స్వాగతించాలి' అని బీజేపీ నేత రామ్ మాధవ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News