F 35B: గాల్లో ఇంధనాన్ని నింపుకుంటూ క్రాష్ అయిన అమెరికా యుద్ధ విమానం
- రీఫ్యూయలింగ్ విమానాన్ని తాకిన ఎఫ్-35బి
- విమానం నుంచి సురక్షితంగా ఎజెక్ట్ అయిన పైలట్
- కాలిఫోర్నియాకు సమీపంలో ప్రమాదం
అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-35బి ఫైటర్ జెట్ పెను ప్రమాదానికి గురైంది. గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే ప్రయత్నంలో రీఫ్యూయలింగ్ ట్యాంకర్ ను ఢీకొని కుప్పకూలింది. అయితే విమానం నుంచి పైలట్ సురక్షితంగా ఎజెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఆయనకు ఆర్మీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
కాలిఫోర్నియాకు సమీపంలోని ఇంపీరియల్ కౌంటీ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. 1600 అడుగుల ఎత్తులో రీఫ్యూయలింగ్ ట్యాంకర్ విమానం కేసీ-130జే విమానాన్ని ఎఫ్-35బి విమానం తాకిందని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. రీఫ్యూయలింగ్ ప్లేన్ సురక్షితంగా ఎయిర్ బేస్ కు చేరుకుందని... క్రూ సభ్యులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు.