Jagan: అది జగన్ 14 ఏళ్ల కల.. విజయసాయి బినామీ రోహిత్ రెడ్డి: యనమల

This is Jagans 14 years dream says Yanamala

  • కోన ప్రాంతాన్ని కబళించాలనేది జగన్ 14 ఏళ్ల కల
  • వైయస్ సీఎంగా ఉన్నప్పుడు ఆ పని జరగకుండా టీడీపీ అడ్డుకుంది
  • కాకినాడ సెజ్ విక్రయాల వల్ల రూ. 4,700 కోట్ల లాభం వచ్చింది

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ సెజ్ పై జగన్ కన్నేయడం ఇప్పుడు కొత్తగా జరిగింది కాదని... కోన ప్రాంతాన్ని కబళించాలనేది ఆయన 14 ఏళ్ల కల అని అన్నారు. తన తండ్రి వైయస్ సీఎంగా ఉన్నప్పుడు ఆ పని జరగకుండా టీడీపీ అడ్డుకుందని జగన్ కక్షకట్టారని చెప్పారు. ఇప్పుడు సీఎం కాగానే బినామీ సంస్థలతో కోనా ప్రాంతాన్ని కొట్టేస్తున్నారని అన్నారు.  సీబీఐ చార్జిషీట్లలో ఉన్న సహనిందితులే బినామీలుగా భూఆక్రమణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బినామీ ఆయన అల్లుడు రోహిత్ రెడ్డేనని యనమల ఆరోపించారు. వైయస్ హయాంలో జరిగిన భూమాయ ఇప్పుడు మళ్లీ జరుగుతోందని అన్నారు. తండ్రీ కుమారుల చేతిలో బాధితులుగా మారింది కోన రైతాంగమేనని చెప్పారు.

భూముల యజమానులైన రైతుల నోళ్లలో మట్టి కొట్టడం దారుణమని అన్నారు. కాకినాడ సెజ్ విక్రయాల వల్ల రూ. 4,700 కోట్ల లాభం వచ్చిందని... అందులో సగం స్థానిక రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాకినాడ సెజ్ లో బల్క్ డ్రగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే కోన ప్రాంతం కాలుష్య ప్రాంతంగా మారుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News