Supreme Court: ఆ స్టేపై వారంలోగా నిర్ణయం తీసుకోండి.. తుళ్లూరు మాజీ తహసీల్దార్ కేసులో హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన
- సుధీర్ బాబుపై ఆరోపణలు
- సీఐడీ విచారణకు ప్రభుత్వ ఆదేశం
- సీఐడీ విచారణపై స్టే ఇచ్చిన హైకోర్టు
- హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ సర్కారు
తుళ్లూరు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు వ్యవహారంలో సీఐడీ విచారణ జరగకుండా హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, వారంలోగా ఈ స్టేపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. వారంలోగా నిర్ణయం తీసుకోకపోతే తామే పరిష్కరిస్తామని తెలిపింది.
సుధీర్ బాబు తహసీల్దార్ హోదాలో అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆయనపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా, హైకోర్టు ఆ ఆదేశాలపై స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఇవాళ ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెలువరించింది.