Bhaskar Ramana: ఏపీ క్యాడర్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి హైదరాబాదులో ఆత్మహత్య

AP cadre IFS Official commits suicide in Hyderabad

  • వీబీ భాస్కర్ రమణ బలవన్మరణం
  • రెండో అంతస్తు నుంచి దూకిన అధికారి
  • డిప్రెషన్ కారణమని భావిస్తున్న పోలీసులు

ఏపీ క్యాడర్ కు చెందిన అటవీ శాఖ ఉన్నతాధికారి ఒకరు హైదరాబాదులో బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. భాస్కర్ రమణ (59) ఏపీ అటవీశాఖలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఆయన హైదరాబాదులోని బండ్లగూడలో నివాసం ఉంటున్నారు. భాస్కర్ రమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి చేసుకుని బెంగళూరులో ఉంటోంది. మరో కుమార్తె చదువు పూర్తయింది.

ఈ నేపథ్యంలో, భాస్కర్ రమణ బుధవారం అర్ధరాత్రి రెండవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మానసికంగా కుంగుబాటుకు గురైనట్టు భావిస్తున్నారు. గత 3 నెలలుగా భాస్కర్ రమణ సెలవులో ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఆయన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలించనున్నారు.

భాస్కర్ రమణ సన్నిహితుడు డాక్టర్ రాజా మాట్లాడుతూ, ఆయనకు చెప్పుకోదగ్గ సమస్యలేవీ లేవని అన్నారు. ఏవైనా ఉంటే ఆఫీసు సమస్యలు ఉండొచ్చని, అది కూడా చిన్నవే అయివుంటాయని, కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. ఆరోగ్య సమస్యలు కూడా లేవని పేర్కొన్నారు. భాస్కర్ రమణ 1987 బ్యాచ్ కు చెందిన అధికారి. ఆయన మరణవార్తతో బ్యాచ్ మేట్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News