Odisha: కేంద్రం ప్రకటించిన అన్ లాక్ 5.0 సడలింపులు ఇవ్వబోమన్న ఒడిశా!
- కరోనా కేసులు అధికంగా ఉన్నాయి
- సినిమాలు, ప్రార్థనా స్థలాలకు అనుమతి లేదు
- ఉత్తర్వులు జారీ చేసిన ఒడిశా
కేంద్రం ప్రకటించినట్టుగా ఈ నెలలో అన్ లాక్ 5.0 సడలింపులను ఇవ్వలేమని, కరోనా వ్యాప్తి అధికంగా ఉండటమే ఇందుకు కారణమని ఒడిశా సర్కారు పేర్కొంది. రాష్ట్రంలోని సినిమా హాల్స్, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, ప్రార్థనా స్థలాలు అక్టోబర్ 31 వరకూ మూతబడే ఉంటాయని స్పష్టం చేసింది. అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్ ను కేంద్ర హోమ్ శాఖ విడుదల చేసిన మరుసటి రోజునే నవీన్ పట్నాయక్ సర్కారు, వాటిని అమలు చేసే పరిస్థితి ఇప్పట్లో లేదని పేర్కొనడం గమనార్హం.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు కూడా మూసే ఉంచుతామని పేర్కొంది. ఎంట్రెన్స్ టెస్టులకు మాత్రం అనుమతిస్తామని, నిబంధనలకు అనుగుణంగా విద్యా సంస్థల్లో నిర్వహణా కార్యకలాపాలు జరుపుకోవచ్చని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఒడిశాలో 2,22,734 కరోనా కేసులు ఉండగా, గడచిన 24 గంటల్లో 3,615 మందికి కరోనా సోకింది. మరణాల సంఖ్య 859కి పెరిగింది.