Sunrisers: మరోసారి గౌరవప్రదమైన స్కోరే... సన్ రైజర్స్ కు కలిసొచ్చేనా..?

Sunrisers posts once again respectable score against Chennai Super Kings

  • దుబాయ్ లో సన్ రైజర్స్ వర్సెస్ సూపర్ కింగ్స్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసిన సన్ రైజర్స్
  • ప్రియమ్ గార్గ్ 51 నాటౌట్

ఐపీఎల్ లో తక్కువ స్కోర్లను కాపాడుకోవడంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రత్యేకత ఉంది. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ మరీ పెద్ద స్కోరేమీ చేయలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడుతూ సన్ రైజర్స్ ఇదే తరహాలో 162 పరుగులు చేసినా, ఆ మ్యాచ్ ను బౌలర్లు, ఫీల్డర్ల చలవతో కాపాడుకుంది. ఇప్పుడు బలమైన సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో తన ఆనవాయితీ కొనసాగిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే... దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓపెనర్ జానీ బెయిర్ స్టో (0) తీవ్రంగా నిరాశపరిచాడు. కెప్టెన్ వార్నర్ 28, మనీష్ పాండే 29 పరుగులు చేశారు. కేన్ విలియమ్సన్ (9) దురదృష్టవశాత్తు రనౌట్ కాగా, యువ ఆటగాడు ప్రియమ్ గార్గ్ 51 నాటౌట్, అభిషేక్ శర్మ 31 పరుగులు నమోదు చేశారు.

చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ 2, శార్దూల్ ఠాకూర్, పియూష్ చావ్లా చెరో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్ లో చెన్నై ఫీల్డర్లు కొన్ని క్యాచ్ లు జారవిడవడం కూడా సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ కు కలిసొచ్చింది.

  • Loading...

More Telugu News