Actor Prabhu: తాను కొవిడ్ బారినపడినట్టు వస్తున్న వార్తలపై తమిళ సినీ నటుడు ప్రభు స్పందన

Actor Prabhu Clarifies about corona rumours
  • ఈ నెల 1న తండ్రి శివాజీ గణేశన్ జయంతి
  • ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో కనిపించని ప్రభు
  • కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో వార్తల షికారు
తాను కొవిడ్ బారినపడ్డానంటూ వస్తున్న వార్తలపై ప్రముఖ తమిళ నటుడు ప్రభు స్పందించారు. తాను కరోనా బారినపడినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, సోషల్ మీడియాలో వస్తున్నవి పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇటీవల తన కాలు బెణికిందని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని వివరించారు.

ఈ నెల 1న తన తండ్రి శివాజీ గణేశన్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఓ స్మారక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, తండ్రి స్మారక కార్యక్రమానికి ప్రభు హాజరు కాకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన కరోనా బారినపడి క్వారంటైన్‌కు వెళ్లడం వల్లే ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో వివరణ ఇచ్చిన ప్రభు.. తన కాలు బెణకడం వల్లే కార్యక్రమానికి హాజరు కాలేదని, అంతే తప్పితే కరోనా సోకిందన్న వార్తల్లో నిజం లేదని ప్రభు కొట్టిపడేశారు.
Actor Prabhu
COVID19
Social Media
shivaji ganesan

More Telugu News