Nagarjuna: స్ట్రెంత్ ట్రైనింగ్ తో ఎంతో ఆరోగ్యవంతంగా మారాను: నాగార్జున

Veteran Hero Nagarjuna talks about strength training
  • ఆరేళ్ల కిందట నడుం, మోకాళ్ల నొప్పులతో బాధపడ్డానన్న నాగ్
  • స్నేహితులు స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి చెప్పారని వెల్లడి
  • ఫిట్ నెస్ లో మానసిక ఉల్లాసం కూడా ముఖ్యమేనని వ్యాఖ్యలు
టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హీరో అంటే నాగార్జునే. ఆయన వయసును అంచనా వేయడం చాలా కష్టం. ఆరు పదుల వయసులోనూ కుర్రకారు అసూయపడే ఫిజిక్ మెయింటైన్ చేయడం ఆయనకే చెల్లింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన హెల్త్ సీక్రెట్ గురించి నాగార్జున చెప్పారు. తాను ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో కొనసాగుతున్నానని, అయితే పోరాట సన్నివేశాలు, డ్యాన్సుల కారణంగా ఓ దశలో ఆరోగ్యం దెబ్బతిన్నదని వివరించారు. ఆరేళ్ల కిందట తీవ్రస్థాయిలో మోకాళ్ల నొప్పులు, నడుంనొప్పితో బాధపడ్డానని వెల్లడించారు.

అయితే, ఆ సమయంలో తన ఫ్రెండ్స్ చెప్పిన స్ట్రెంత్ ట్రైనింగ్ విధానం పాటించానని, తద్వారా మునుపటి ఆరోగ్యాన్ని పొందానని తెలిపారు. ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి తెలిసినవాళ్లకు కూడా వివరించానని అన్నారు. అయితే శారీరకంగానే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉన్నప్పుడే మనం ఫిట్ గా ఉన్నట్టు భావించాలని నాగార్జున అభిప్రాయపడ్డారు.
Nagarjuna
Strength Training
Health
Fitness
Tollywood

More Telugu News