Shourya: అణు క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్

India successfully test fires nuclear capable Shourya missile
  • ఒడిశా తీరం నుంచి లక్ష్యాన్ని ఛేదించిన శౌర్య
  • శౌర్య పరిధి 800 కిలోమీటర్లు
  • త్వరలోనే సాయుధ బలగాల చేతికి నూతన శౌర్య
అణ్వస్త్రాలను మోసుకెళ్లగలిగిన శౌర్య క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించింది. శౌర్య క్షిపణి పరిధి 800 కిలోమీటర్లు. ఇది భూతలం నుంచి భూతలం పైకి ప్రయోగించే వీలున్న క్షిపణి. ఇటీవల కాలంలో శౌర్యను మరింత అభివృద్ధి చేశారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచిన అప్ డేటెడ్ వెర్షన్ నే ఇవాళ పరీక్షించి చూశారు. ఆధునికీకరించిన శౌర్యను త్వరలోనే వ్యూహాత్మక బలగాలకు అందించనున్నారు.

ప్రస్తుతం పాత వెర్షన్ శౌర్య భద్రతా బలగాల వద్ద ఉంది. అయితే కొత్తది ఎంతో తేలికైనది, ప్రయోగించడానికి ఎంతో సులువైనదని రక్షణ రంగ వర్గాలు తెలిపాయి. శౌర్య క్షిపణి ప్రత్యేకత ఏంటంటే.... లక్ష్యానికి దగ్గరయ్యే సమయంలో హైపర్ సోనిక్ వేగం అందుకుంటుంది. తద్వారా దీన్ని నిలువరించడం ఏ వ్యవస్థకు సాధ్యం కాదు. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న శౌర్య క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది.
Shourya
Nuclear Missile
Odisha
DRDO
India

More Telugu News