Sri Lanka: తేయాకు అద్దకంతో మాస్కులు... శ్రీలంక వినూత్న ఆవిష్కరణ

Sri Lanka brings tea dyed masks amidst corona pandemic

  • అన్ని రంగాలను దెబ్బతీసిన కరోనా
  • సిలోన్ టీ బ్రాండ్ కు మరింత ప్రచారం కల్పిస్తున్న శ్రీలంక
  • సిలోన్ టీని మరిన్ని దేశాలకు విస్తరించే ప్రణాళిక

కరోనా వైరస్ ఇంచుమించు ప్రతి రంగాన్ని దెబ్బతీసింది. అయితే, శ్రీలంక ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి, కరోనా పరిస్థితులను తమ తేయాకు బ్రాండ్ ప్రచారానికి ఉపయోగించుకుంటోంది. శ్రీలంక టీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఇక్కడ తయారయ్యే తేయాకుతో శ్రీలంక టీ బోర్డు (ఎస్ఎల్ టీబీ) తమ సిలోన్ టీ బ్రాండ్ ను మరింత విస్తృతం చేసేందుకు తాజాగా తేయాకు అద్దకంతో రూపొందించిన మాస్కులను తయారుచేస్తోంది.

ఐస్ టీ తయారుచేసినప్పుడు మిగిలే పొడితో ఈ డై తయారుచేసి మాస్కుపై అద్దకం చేస్తారు. ఈ మాస్కులు 30 ఉతుకుల వరకు మన్నికగా ఉంటాయని ఎస్ఎల్ టీబీ చెబుతోంది. ఈ మాస్కులు సహజసిద్ధంగానే సూక్ష్మక్రిములపై పోరాడే గుణం కలిగి ఉంటాయని, పర్యావరణ హితమని, విష పదార్థ రహితమని పేర్కొంది. ప్రస్తుతం ఈ మాస్కులను శ్రీలంక విదేశీ మంత్రిత్వ శాఖ తమ విదేశీ దౌత్యకార్యాలయాల ద్వారా ఉచితంగా అందిస్తోంది. తద్వారా తమ సిలోన్ బ్రాండ్ టీకి మరింత ప్రచారం లభిస్తుందని ఎస్ఎల్ టీబీ భావిస్తోంది.

  • Loading...

More Telugu News