Donald Trump: ఇది నాకు నిజమైన పరీక్ష... బయటకు వస్తాననే అనుకుంటున్నా: వీడియో పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్!

Trump Release a Video

  • తెల్లవారుజామున 4.21 గంటలకు వీడియో
  • మొదలు పెట్టిన ప్రచారాన్ని ముగిస్తాను
  • రానున్న రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి
  • ఆసుపత్రి నుంచే పనిచేస్తున్నానన్న ట్రంప్

కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఓ వీడియోను విడుదల చేశారు. ఈ తెల్లవారుజామున 4.21 గంటలకు తన ట్విట్టర్ ఖాతాలో ట్రంప్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో ఉన్న ట్రంప్, సమీప భవిష్యత్తు తనకు నిజమైన పరీక్షని, దీనిలో విజయం సాధించి బయటకు వస్తాననే అనుకుంటున్నానని అన్నారు. "నేను ఇక్కడికి రావడం ఏమంత మంచిగా అనిపించడం లేదు. ప్రస్తుతం కొంచెం ఫర్వాలేదు. త్వరలోనే బయటకు వచ్చి, నేను ప్రారంభించిన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తాననే భావిస్తున్నాను. రానున్న రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి" అని ఆయన అన్నారు.

కాగా, ఈ వీడియో భారత కాలమానం ప్రకారం, ఈ తెల్లవారుజామున విడుదల కాగా, దీన్ని ముందుగానే చిత్రీకరించారా? లేదా వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో చేరిన తరువాత షూట్ చేశారా? అన్న విషయమై స్పష్టత లేదు. ఈ వీడియోలో ట్రంప్ బాగానే కనిపిస్తున్నారు. గొంతు మాత్రం కాస్తంత తేడాగా ఉన్నట్టు తెలుస్తోంది. వైట్ డ్రస్ పై నీలి రంగు బ్లేజర్ వేసుకుని ట్రంప్ కనిపించారు.ప్రస్తుతం తాను ఆసుపత్రి నుంచి పనిచేయడం మినహా మరేమీ చేయలేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.

కాగా, ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన వైట్ హౌస్ ఫిజీషియన్ సీన్ కాన్లీ, ట్రంప్ కు గత 24 గంటలుగా జ్వరం రాలేదని, అయితే, దగ్గు, జలుబు మరింతగా పెరిగాయని, ఒంట్లో నీరసం కూడా అధికమైందని అన్నారు. ట్రంప్ తన రోజువారీ పాలనా వ్యవహారాలను చూసుకునేందుకు ఆసుపత్రిలో ఓ సూట్ ను సిద్ధం చేసి, అక్కడ అన్ని రకాల సమాచార సాధనాలనూ ఏర్పాటు చేశారు. వైట్ హౌస్ కు ప్రత్యామ్నాయంగా ఈ సూట్ ఉంటుందని, ఇక్కడి నుంచే అన్ని పనులనూ తాను చక్కబెట్టగలనని ట్రంప్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News