ncb: డ్రగ్స్ కేసులో హీరోయిన్ దీపిక పదుకొణేను విచారించిన ఎన్సీబీ అధికారికి కరోనా పాజిటివ్
- ముంబై, కొలాబాలోని ఎవెలిన్ గెస్ట్ హౌస్‌లో ఇటీవల విచారణ
- విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ మల్హోత్రా
- కరోనాకు చికిత్స తీసుకుంటున్న అధికారి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో విచారణ జరుపుతోన్న అధికారులకు డ్రగ్స్ కోణం గురించి తెలిసిన విషయం విదితమే. సినీ పరిశ్రమలోని కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్ వాడుతోన్న ఆరోపణల కేసులో విచారణ కొనసాగుతోంది. హీరోయిన్ దీపికా పదుకొణేను ఇటీవలే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
ముంబై, కొలాబాలోని అపోలో బండర్‌లో ఎవెలిన్ గెస్ట్ హౌస్‌లో ఈ విచారణ కొనసాగింది. అయితే, ఆమెను విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
ఇటీవల తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆయన సూచించారు. కాగా, ఎన్‌సీబీ ప్రత్యేక బృందంలో మరొకరికి కూడా గత నెల 17న కరోనా సోకింది. కాగా, డ్రగ్స్ కేసులో దీపికతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్, దీపిక మేనేజర్ కరీష్మా ప్రకాశ్‌కు ఎన్సీబీ అధికారులు ఇటీవల సమన్లు జారీ చేసి విచారించారు.