Virat Kohli: గాలికి ఎగురుతున్న ముంగురులతో అనుష్కశర్మ పిక్, 6 లక్షల లైక్ లు... స్పందించిన కోహ్లీ!

anushka New Pic Viral in Social Media
  • జనవరిలో అనుష్కకు డెలివరీ
  • సోషల్ మీడియాలో తాజా పిక్ సెన్సేషన్
  • అద్భుతంగా ఉందన్న విరాట్ కోహ్లీ
మరో మూడు నెలల్లో తమ తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు మోస్ట్ సెలబ్రిటీ కపుల్స్ లో ఒకటైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనుష్క ఆరు నెలల గర్భవతి కాగా, జనవరిలో తమ ఇంట కొత్త వ్యక్తి రానున్నాడని ఇప్పటికే వీరిద్దరూ స్పష్టం చేసి, అందుకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

తాజాగా, మోనోక్రోమ్ (బ్లాక్ అండ్ వైట్)లో అనుష్క తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పిక్చర్ వైరల్ అయింది. వీస్తున్న గాలికి కురులు ఎగురుతూ ఉంటే, అనుష్క ఈ చిత్రాన్ని తీయించుకుంది. దీన్ని నెట్టింట పెట్టీ పెట్టగానే, లైక్ ల వెల్లువ ప్రారంభమైంది. చిరు నవ్వుతో ఉన్న అనుష్క పిక్ ప్రతి ఒక్కరికీ నచ్చేసింది. దీనికి నిమిషాల వ్యవధిలోనే దాదాపు 6 లక్షల లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2020 పోటీల కోసం దుబాయ్ లో ఉన్న అనుష్క భర్త విరాట్ కోహ్లీ సైతం ఈ చిత్రాన్ని చూశాడు. పిక్ అద్భుతంగా ఉందన్నాడు.

ఇక ఈ పిక్ బాలీవుడ్ సెలబ్రిటీలకూ నచ్చేసింది. అనుష్క సహ నటీనటులు వరుణ్ ధావన్, తారా సుతారియా, నేహా ధూపియా, కీర్తి సనన్ వంటి ఎంతో మంది ఈ పిక్ ను లైక్ చేస్తూ, కామెంట్లు పెట్టారు. ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. సెలబ్రిటీలు, అభిమానుల నుంచి ఈ జంటకు పండంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నట్టు కామెంట్లు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.
Virat Kohli
Anushka Sharma
Pic
Delivery
Social Media

More Telugu News