Nandigam Suresh: జగన్ ను అమిత్ షా మందలించారన్న ప్రచారం అవాస్తవం: నందిగం సురేశ్

Nandigam Suresh clarifies Amit Shah did not reprimanded CM Jagan
  • జగన్ ఎవరిముందు బెండ్ అయ్యేరకం కాదన్న నందిగం
  • బెండ్ తీసే రకం అని వ్యాఖ్యలు
  • పసుపు రంగు బ్యాచ్ కి ఒక దరిద్రం పట్టిందని వ్యాఖ్యలు
ఏపీ రాజకీయ పరిణామాలపై వైసీపీ యువ ఎంపీ నందిగం సురేశ్ స్పందించారు. ఇటీవల సీఎం జగన్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మందలించారన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఎవరిముందు బెండ్ అయ్యే రకం కాదని, బెండు తీసే రకం అని అన్నారు. కొందరు తమలాగే అందరూ బెండ్ అవుతారని అనుకుంటారని వ్యాఖ్యానించారు. పెద్దల వద్ద బెండ్ అవడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్ కి అలవాటని ఆరోపించారు.

పసుపు రంగు బ్యాచ్ కి ఒక దరిద్రం పట్టిందని, వాళ్లకి జరిగిన అవమానాలే ఎదుటివాళ్లకు కూడా జరిగాయని అనుకుంటున్నారని విమర్శించారు. పట్టాభి, సబ్బం హరి అసలు లెక్కలోనే లేకపోతే, వాళ్లపై ప్రత్యేకంగా దాడి చేసేది ఎవరు? రాష్ట్రంలో వాళ్లిద్దరినీ పట్టించుకునేవాళ్లే లేరని వ్యంగ్యం ప్రదర్శించారు.
Nandigam Suresh
Jagan
Amit Shah
Chandrababu
Nara Lokesh

More Telugu News