Komatireddy Venkat Reddy: తెలంగాణ ప్రజలు ఎవరూ ఎల్ఆర్ఎస్ కట్టొద్దు... మేం వచ్చాక ఉచితంగా క్రమబద్ధీకరిస్తాం: కోమటిరెడ్డి

Komatireddy says Telangana people do not pay LRS fee

  • ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం
  • దోచుకోవడానికే ఎల్ఆర్ఎస్ అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యలు
  • హైకోర్టులో పిటిషన్ వేశామని వెల్లడి

స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ విధానంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పేరుతో దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, దీని ద్వారా ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే లక్ష కోట్లు వస్తాయని, తెలంగాణ వ్యాప్తంగా మూడు లక్షల కోట్లు రాబట్టుకోవాలన్నది ప్రభుత్వ పన్నాగం అని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలు ఎవరూ ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని అన్నారు. తప్పుడు లేఅవుట్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఎలాంటి జరిమానా లేకుండా ప్లాట్లను క్రమబద్ధీకరించాలని న్యాయస్థానంలో పిటిషన్ వేశామని కోమటిరెడ్డి వెల్లడించారు. హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. న్యాయం కోసం సుప్రీంకోర్టునైనా ఆశ్రయిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News