JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై మళ్లీ కేసు నమోదు

Police files another case on JC Prabhakar Reddy and his son Asmith Reddy
  • జేసీ కుటుంబ సభ్యులను వదలని కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
  • హైదరాబాద్ నుంచి తాడిపత్రి రాక
  • తాడిపత్రిలో జేసీకి టీడీపీ శ్రేణుల ఘనస్వాగతం
  • ర్యాలీకి అనుమతిలేదన్న పోలీసులు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా తండ్రీతనయులపై మళ్లీ కేసు నమోదైంది. కరోనా వైరస్ నుంచి కోలుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న హైదరాబాద్ నుంచి తాడిపత్రి రాగా, ఆయనకు టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికాయి. అయితే ఈ స్వాగత కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని, పైగా కొవిడ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ తాడిపత్రి పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి సహా 36 మందిపై కేసు నమోదు చేశారు.

జేసీ 30 పోలీస్  యాక్ట్ ను అతిక్రమించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. తాడిపత్రిలో గత సంవత్సరం నుంచి 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, ఎలాంటి కార్యక్రమాలకైనా తమ అనుమతి తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు.

గత కొంతకాలంగా జేసీ కుటుంబ సభ్యులను పోలీసు కేసులు వదలడంలేదు. బీఎస్ 3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న ఆరోపణలపై నమోదైన కేసు, విధుల్లో ఉన్న దళిత పోలీసు అధికారిని దూషించారన్న కేసు, ఇప్పుడీ నిబంధనల అతిక్రమణ కేసును జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదుర్కొంటున్నారు.
JC Prabhakar Reddy
Asmith Reddy
Police
Tadipatri
Hyderabad
Corona Virus
Telugudesam

More Telugu News