Anil Devgan: బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సోదరుడు హఠాన్మరణం

Bollywood actor Ajay Devgan brother Anil Devgan dies of heart attack
  • సోమవారం రాత్రి గుండెపోటుకు గురైన అనిల్ దేవగణ్
  • అనిల్ వయసు 51 సంవత్సరాలు
  • తమ్ముడ్ని కోల్పోయానంటూ అజయ్ ట్వీట్
బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అజయ్ దేవగణ్ సోదరుడు అనిల్ దేవగణ్ ముంబయిలో హఠాన్మరణం చెందారు. అనిల్ వయసు 51 సంవత్సరాలు. అనిల్ గతరాత్రి గుండెపోటుకు గురయ్యాడని అజయ్ దేవగణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  

"నా తమ్ముడ్ని కోల్పోయాను. అతడి అకాలమరణంతో మా హృదయాలు బద్దలయ్యాయి. అతడి లేని లోటు మా కుటుంబ సభ్యులకు తీర్చలేనిది. అతడి ఆత్మశాంతి కోసం ప్రార్థించండి. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మేం సామూహిక ప్రార్థనల కార్యక్రమాన్ని నిర్వహించడంలేదు" అని వివరించారు. కాగా, సోదరుడ్ని కోల్పోయిన అజయ్ దేవగణ్ ను బాలీవుడ్ ప్రముఖులు పరామర్శిస్తున్నారు.
Anil Devgan
Ajay Devgan
Heart Attack
Mumbai
Demise

More Telugu News